wear mask even at home: ఇంట్లో ఉన్నా మాస్క్ తప్పనిసరి : కేంద్రం

wear mask కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని సోమవారం కేంద్రప్రభుత్వం తెలిపింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించింది.

సోమవారం నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఇళ్లల్లో కూడా అందరూ మాస్క్ ధరించాలని సూచించారు. కుటుంబంలో ఎవరైనా కోవిడ్ -19 పాజిటివ్ కేసు ఉంటే, ఆ వ్యక్తి ఇంటి లోపల కూడా మాస్క్ ధరించడం చాలా ముఖ్యమని, ఎందుకంటే వైరస్ ఇంట్లోని ఇతరులకు వ్యాపించగలదని అన్నారు. ఇంట్లో కూడా అందరూ మాస్క్ ధరించడం ప్రారంభించే సమయం ఆసన్నమైందని వీకే పాల్ తెలిపారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దని సూచించారు. అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచిందని తెలిపారు.

మాస్క్ ను సరిగ్గా ధరించకపోతే..వైరస్ సోకిన వ్యక్తి ఇతరులకు వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశం 90శాతం వరకు ఉంటుందని కేంద్ర సంయుక్త ఆరోగ్య కార్యదర్శి లావ్ అగర్వాల్ చెప్పారు. ఎవరికైనా కోవిడ్-19 సంబంధిత రోగ లక్షణాలున్నంటే వెంటనే వారు ఐసొలేట్ అవ్వాలని,కరోనా టెస్ట్ రిపోర్టు వచ్చే వరకు ఆగవద్దని ఎయిమ్స్ డెరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఒక్కోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ లో ఫలితం తప్పుగా వచ్చే అవకాశముందన్నారు. వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ ఉన్నా ఫలితంలో నెగిటివ్ గా వచ్చే అవకాశముందని ఎయిమ్స్ డెరక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.సాధారణ లక్షణాలున్నా కోవిడ్ రోగులేనని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు