కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఒంటరిగా 42 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

TMC: అలాగే, అసోం, మేఘాలయా నుంచి కూడా టీఎంసీ పోటీ చేయనుంది.

TMC

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తులు లేకుండా పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించారు. అలాగే, కోల్‌కతా నుంచి టీఎంసీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ బహరామ్‌పుర్‌ నుంచి పోటీ చేయనున్నారు. మహువా మొయిత్రాకు మళ్లీ కృష్ణానగర్‌ నుంచి పోటీ చేస్తారు. మొత్తం ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ దక్కలేదు. యూపీలో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో టీఎంసీ చర్చలు జరుపుతోంది.

అలాగే, అసోం, మేఘాలయా నుంచి కూడా టీఎంసీ పోటీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఇండియా కూటమి కోసం త్యాగాలు చేయాలని ఆ అలియన్స్ లోని నేతలు మొదటి నుంచి అంటున్నారు. కానీ, ఏ పార్టీ కూడా త్యాగాలు చేయకుండా తమపని తాము చేసుకుంటూ పోతోంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో టీఎంసీ పొత్తులో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది.

42 స్థానాల్లో ఎవరెవరు?

 Also Read: యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్.. కాంగ్రెస్ కంచుకోటలో పోటీ

ట్రెండింగ్ వార్తలు