TMC MP Kalyan Banerjee : మిమిక్రీ ఒక కళ..! ఉపరాష్ట్రపతిని అవమానించారన్న మిమర్శలపై స్పందించిన టీఎంసీ ఎంపీ

ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించారు.

TMC MP Kalyan Banerjee

Vice President of India : శీతాకాల సమావేశాల నుంచి సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు జగదీప్ దన్కర్ ను మిమిక్రీ చేస్తూ హేళన చేశాడు. ఈఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీజేపీ నేతలు టీఎంసీ ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోనిడిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో టీఎంసీ ఎంపీపై ఫిర్యాదుసైతం నమోదైంది. ఎంపీపై అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Also Read : PM Modi : ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం.. ద్రౌపది ముర్ము ఏమన్నారంటే ..

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఎంపీల ప్రవర్తనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. కొంతమంది ఎంపీల దారుణమైన ప్రవర్తనపై ప్రధాని చాలా బాధను వ్యక్తంచేశారని, టీఎంసీ ఎంపీ మిమిక్రీ చేసి హేళన చేయడం పట్ల ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారని ఉపరాష్ట్రపతి తెలిపారు. మరోవైపు.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసైతం ట్విటర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ప్రాంగణంలో అవమానించిన తీరుచూసి విస్తుపోయానని అన్నారు. ఎన్నికైన ప్రతినిధులు తమ భావాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛగా ఉండాలని, కానీ, వారి వ్యక్తీకరణ గౌరవ మర్యాదలకు లోబడి ఉండాలని ద్రౌపది ముర్ము అన్నారు.

Also Read : Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎంపీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించారు. మిమిక్రీ అనేది కళ. నాకు ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదు. రాజ్యసభలో ఆయన (ఉపరాష్ట్రపతి) నిజంగా ఇలానే ప్రవర్తిస్తాడా అంటూ ప్రశ్నించారు. 2014-2019 మధ్య లోక్ సభలో ప్రధాని ఇలాంటి అనేకం చేశాడంటూ టీఎంసీ ఎంపీ అన్నారు.