తమిళనాట డీఎంకే కు ఎదురుదెబ్బ

  • Publish Date - October 24, 2019 / 08:13 AM IST

తమిళనాడులో 2 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ముందంజలో ఉంది. గతంలో మంచి జోరుమీదున్న డీఎంకేకు ఈ ఉప ఎన్నికల్లో బ్రేక్ పడింది.  రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ అన్నా డీఎంకే ఆధిక్యంలో ఉన్నట్లు నేటి ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రెండూ స్ధానాలను అన్నాడీఎంకే  గెలుచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. 

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 39 ఎంపీ స్ధానాలున్న తమిళనాడులో 22 స్ధానాలను డీఎంకే కైవసం చేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఉప ఎన్నికల్లోనూ డీఎంకే తన హావాసాగిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.  అందరి అంచనాలు తలికిందులు చేస్తూ ఓపిఎస్ ఈపీఎస్ టీమ్ కు ప్రజలు పట్టంకట్టారు.  మరి 2021 లో జరిగే తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓపీఎస్-ఈపీఎస్ ద్వయంచేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.