Today Gold Price : దేశంలో బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగా బంగారం ధర పెరగ్గా, మరికొన్ని చోట్ల స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ. 44,760కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ.48,820 కి చేరింది.