Tomato Prices : చెన్నైలో కిలో టమాట ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

టమాటలే కాకుండా..వంకాయ, బెండకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నామని ఓ గృహిణి ఆందోళన వ్యక్తం చేశారు...

Tomato prices Chennai : చికెన్, మటన్ ధరలతో టమాట పోటీ పడుతోంది. మార్కెట్ లోకి వెళితే..కిలో టమాట ధర ఎంత అనగానే..వారు చెప్పే రేటు విని మైండ్ బ్లాక్ అయిపోతోంది. ఎందుకంటే కిలో టమాట ధర పెట్రోల్ రేటును దాటేసింది. చెన్నైలోని కోయంబేడు హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో రూ. 100 పలికింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం రూ. రూ. 90 పలికింది. దీనికి కారణం..భారీ వర్షాలే అని అంటున్నారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. చెన్నై మునిగిపోతుందా అన్నట్లుగా కురిసిన వర్షాలతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పైకి ఎగబాకాయి. ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటలు ఎక్కువగా పండుతుంటాయి. వర్షాలతో ఈ పంటకు భారీ నష్టం వాటిల్లింది.

Read More : Woman Jumps Into Well : తీవ్ర విషాదం… ఐదుగురు కూతుళ్లతో బావిలో దూకిన తల్లి

దీని కారణంగా..మార్కెట్ లో ధరలు పెరిగిపోయాయి. టమాటలే కాకుండా..వంకాయ, బెండకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో ఏమీ కొనలేకపోతున్నామని ఓ గృహిణి ఆందోళన వ్యక్తం చేశారు. టమాటలను కొనడం లేదని, ఈ ధరల పెరుగుదల తమ బడ్జెట్ పై ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయడానికి సీఎం స్టాలిన్ ఏమైనా చేస్తారని ఆశిస్తున్నామన్నారు. కిలో ఏకంగా రూ. 120 పలుకుతోంది..ధరలు అమాంతం పెరిగాయని రిటైల్ మార్కెట్ లో ఇప్పుడు కిలో రూ. 120 కంటే ఎక్కువగా అమ్ముడవుతోందని కోయంబేడు పండ్లు, కూరగాయాల వ్యాపారుల సంఘం అధ్యక్షులు ఎం.త్యాగరాజన్ వెల్లడించారు. ధరలు పెరగడం కారణంగా..టమాటలను కొనేందుకు ప్రజలు ముందుకు రారని, దీంతో అమ్మకానికి పనికి రాకుండా పాడైపోతాయని..ఫలితంగా వ్యాపారులు నష్టాలను చవి చూడాల్సి వస్తుందన్నారు.

Read More : Tourism in Kashmir : కశ్మీర్ కు పొటెత్తుతున్న పర్యాటకులు..తెలుగువాళ్లే ఎక్కువగా

ధరలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోయంబేడు హోల్ సేల్ మార్కెట్ లో కూరగాయలు విక్రయించే వ్యాపారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తర భారతం లేద, మహారాష్ట్రల నుంచి భారీ మొత్తంలో స్టాక్ లు తెప్పిస్తే ధరలు నియత్రణకు వస్తాయన్నారు. లేకపోతే..వ్యాపారులు దుకాణాలు మూసివేసుకుని..ఉద్యోగాల కోసం వెతుక్కొనే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విషయంలో తమిళనాడు వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి స్పందించారు. మార్కెట్ లో ధరలు పెరుగుతుండడంతో పలు చర్యలు తీసుకుంటున్నట్లు, ఉత్తర భారతం నుంచి భారీగా స్టాక్ ను తెప్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు