Top Electric Scooters : ఎలక్ట్రిక్ బైక్స్ లో ఏది బెస్ట్? 

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హావ నడుస్తుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. అయితే డిమాండ్ కు తగిన వాహనాలు మార్కెట్లో లభించడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారి కంపెనీలు ఉత్పత్తి వేగం పెంచి.. కొత్త హంగులు జోడిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు.. వాటి సామర్థ్యం గురించి తెలుసుకుందాం.

Top Electric Scooters : ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హావ నడుస్తుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. అయితే డిమాండ్ కు తగిన వాహనాలు మార్కెట్లో లభించడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారి కంపెనీలు ఉత్పత్తి వేగం పెంచి.. కొత్త హంగులు జోడిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు.. వాటి సామర్థ్యం గురించి తెలుసుకుందాం.
                                                                                                 
ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌
ఓలా కంపెనీ గతంలో  క్యాబ్ స‌ర్వీసెస్ లు నడిపేది. ఈ కంపెనీ తమిళనాడులో రూ.2400 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారి కంపెనీ ఏర్పాటు చేసింది. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ ఫీచ‌ర్ల‌కు సంబంధించి ఓలా ఎల‌క్ట్రిక్ కంపెనీ సీఈవో భ‌విష్ అగ‌ర్వాల్‌ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఈ స్కూట‌ర్‌ను ఒక్క‌సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీని గరిష్ట వేగం 90 కిలోమీటర్లు.. సెకండ్ల వ్యవధిలో 0 – 60 కిలోమోటర్ల వేగం అందుకోగలదు. ఇక దీనిని 50 శాతం ఛార్జింగ్ చేయడానికి కేవలం 18 నిమిషాల సమయం పడుతుంది.
                                                                                           
బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ చేత‌క్‌
బ‌జాజ్ నుంచి వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ చేత‌క్‌పై విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికే చాలామంది బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్ లో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ చేత‌క్ అర్బ‌న్‌, ప్రీమియం రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. వీటి ఎక్స్ షోరూం ప్రైజ్‌ ధ‌ర‌లు రూ.1.22 ల‌క్ష‌లు, రూ.1.26 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు.
                                                                                                       
ఏథ‌ర్ ఎన‌ర్జీ
ఇటీవల ఏథ‌ర్ 450 ఎక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను భార‌త విప‌ణిలోకి తీసుకొచ్చింది. ఇందులో ఎకో, రైడ్‌, స్పోర్ట్స్‌, వార్ప్ అనే నాలుగు మోడ్‌లు ఉన్నాయి. మూడు సెక‌న్ల‌లోనే 40 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ స్కూట‌ర్‌లో ఇన్‌బిల్ట్ 4జీ సిమ్‌కార్డుతో పాటు ఏడు అంగుళాల ట‌చ్ స్క్రీన్ డ్యాష్‌బోర్డు వ‌స్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే  ఎక్స్ షోరూం రూ. 1,61,426 గా ఉంది.
                                                                                                             
హీరో ఎల‌క్ట్రిక్ ఆప్టిమా
ద్విచ‌క్ర‌వాహ‌నాల మార్కెట్‌లో హీరో కంపెనీకి మంచి పేరుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాలు ఈ కంపెనీవే.. ఈ దిగ్గజ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి కూడా దిగింది. బ‌డ్జెట్‌లో వివిధ ర‌కాల ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. హీరో కంపెనీ అందుబాటులోకి తెచ్చిన వాటిలో ఎలక్ట్రిక్ ఆప్టిమా మోడ‌ల్ కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.50 వేల లోపే ఉంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ అవ్వ‌డానికి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.  దీని గరిష్ట వేగం గంటకు 42 కిలోమీటర్లు. బ్యాటరీ 51.2V / 30Ah గా ఉంది.
                                                                                                   
టీవీఎస్ ఐక్యూబ్
ఈ కంపెనీ తయారు చేసిన ఐక్యూబ్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది గంటకు 78 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. 4.2 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది. దీని ఛార్జింగ్ కేబుల్ ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. దీని ధర రూ. 1,29,893 ఉంది. సీట్ కింద హెల్మెంట్ పెట్టుకునేందుకు స్పేస్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు usb స్లాట్ కూడా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు