India Pak Match 2021
India Pak Match 2021: ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకవైపు నరాలు తెగే ఉత్కంఠ.. ఇండియా గెలవాలనే తపన సహజం. ఈ మ్యాచ్ మీదనే ఎన్నడూ ఎరుగని రీతిలో భారీ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కి శనివారమే భారీ ఎత్తున బెట్టింగ్స్ మొదలయ్యాయి. టాస్ ఏ టీం విన్ అవుతుంది.. ఎవరు ఎంత కొడతారు.. ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు.. టీం 11లో ఎవరు ఉంటారు… ఎవరు ఉండరు ఇలా ఏదైనా బెట్టింగే.
T20 World Cup 2021 : సూపర్-12లో ఆసీస్ శుభారంభం…సౌతాఫ్రికాపై విజయం
ఇప్పటికే ఆన్లైన్ మార్కెట్ లో పాక్ పై వెయ్యికి 1600, ఇండియాపై వెయ్యికి 530 నడుస్తుండగా.. బయట మార్కెట్లో పాక్ పై వెయ్యికి 4 వేలు, ఇండియాపై వెయ్యికి 2 వేలు నడుస్తుంది. బెట్టింగ్ మాఫియాపై ఒకవైపు పోలీసులు నజర్ మోగిస్తున్నా.. అడ్డుకట్ట పడడం లేదు. బుకీలు రకరకాల మార్గాలలో మొదటి బాల్ నుండి చివరి బంతి వరకు బెట్టింగ్ లకు ప్లాన్ చేస్తూ రారమ్మని ఊరిస్తున్నారు. కొత్త కొత్త రేట్లు ఆశ చూపుతున్న బుకీలు బెట్టింగ్ రాయుళ్లకి ఉసిగొల్పుతున్నారు.
T20 World Cup 2021 : ఇండియా, పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. ఒక్కరోజు ముందే టీమ్ ప్రకటన
ఎప్పటిలా కాకుండా.. ఆకర్షణీయమైన రేట్లుతో క్రికెట్ బుకీలు అకట్టుకుంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతంలో అరెస్ట్ చేసిన బుకీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు.. ఈసారి కఠినంగా అడ్డుకోవాలని ప్లాన్స్ లో ఉన్నారు. మరోవైపు యువత క్రికెట్ బెట్టింగ్ లతో జీవితాలు నాశనం చేదుకోవద్దని సూచిస్తున్న పోలీసులు రకరకాల మార్గాలలో ఈ బెట్టింగులపై నిఘా పెట్టారు. శనివారమే భారీ స్థాయిలో మొదలైన ఈ బెట్టింగ్స్ ఆదివారం మ్యాచ్ సమయానికి ఇంకెంత స్థాయిలో ఇది జరగనుందన్నది ఆందోళన కలిగిస్తుంది.