Harsh Sanghavi: ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా.. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ట్రాఫిక్ చలాన్లు పడవు.. గుజరాత్ మంత్రి

ఎంత జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర చలానుకు చిక్కుతున్న వారు ఎందరో. అసలు ఈ చలాన్లే లేకపోతే ఎంత బాగుండు అని అనుకుంటారు చాలా మంది. అయితే మొత్తమే రద్దు చేయడం కాదు కానీ, ఒక వారం రోజులైతే చలాన్లు లేకుండా ఉపశమనం కల్పించారు.

Harsh Sanghavi: రోడ్డుపైకి వెళ్దామంటే ట్రాఫిక్ పోలీసులతో భయపడుతుంటూ ఉంటారు. ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. లేదంటే కంగారులో బండిని జీబ్రా క్రాసింగ్ మీదకు తీసుకెళ్తుంటాం. మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఎక్కడి నుంచో మన ఫొటో పడుతుంది. చూస్తే బండి మీద చలాన్ పడుతుంది. ఎంత జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర చలానుకు చిక్కుతున్న వారు ఎందరో. అసలు ఈ చలాన్లే లేకపోతే ఎంత బాగుండు అని అనుకుంటారు చాలా మంది. అయితే మొత్తమే రద్దు చేయడం కాదు కానీ, ఒక వారం రోజులైతే చలాన్లు లేకుండా ఉపశమనం కల్పించారు.

మీరు విన్నది నిజమే.. గుజరాత్ ప్రభుత్వం అక్కడి స్థానికులకు ఈ వెసులుబాటు కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా.. చలాన్లు మాత్రం వేయరట. అలా అని ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉండకూదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ విషయమై ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘21 అక్టోబర్ నుంచి మొదలు 27 అక్టోబర్ వరకు గుజరాత్ ట్రాఫిక్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు చలాన్లు వేయరు. అలా అని బహిరంగ ప్రదేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించవద్దని కాదు. కొన్ని పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా చలానా వేయరు అంతే’’ అని అన్నారు.

Viral Video: రోడ్డుపైకి వచ్చి.. ఆగి ఉన్న కారుపై లిప్‌స్టిక్‌తో బాలుడి గీతలు.. వైరల్ అవుతున్న బుడతడి ఫన్నీ వీడియో

ట్రెండింగ్ వార్తలు