Viral Video: రోడ్డుపైకి వచ్చి.. ఆగి ఉన్న కారుపై లిప్‌స్టిక్‌తో బాలుడి గీతలు.. వైరల్ అవుతున్న బుడతడి ఫన్నీ వీడియో

చిన్న పిల్లలు అమాయకత్వంతో చేసే అల్లరి పనులు నవ్వు తెప్పిస్తూ ఆసక్తికరంగా ఉంటాయి. కావాలంటే ఈ ఫన్నీ వీడియో చూడండి. ఒక బుడతడు దగ్గర్లోని కారుపై లిప్‌స్టిక్‌తో ఎలా గీతలు గీశాడో..!

Viral Video: రోడ్డుపైకి వచ్చి.. ఆగి ఉన్న కారుపై లిప్‌స్టిక్‌తో బాలుడి గీతలు.. వైరల్ అవుతున్న బుడతడి ఫన్నీ వీడియో

Viral Video: చిన్న పిల్లలు తమ చేతిలో ఉన్న పెన్ను, పెన్సిల్స్ వంటి వాటితో గోడలపై, పుస్తకాలపైనే కాకుండా ఎక్కడపడితే అక్కడ గీతలు గీసేస్తూ ఉంటారు. అవి సరదాగా అనిపిస్తుంటాయి. సాధారణంగా పిల్లలు ఇలాంటి అల్లరి తమ ఇంట్లోనే చేస్తుంటారు. కానీ, ఈ బుడతడు చూడండి.. రోడ్డుపైకి బొమ్మ కారుతో వచ్చి, అక్కడ ఆగి ఉన్న కారుపై గీతలు గీశాడు.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

అది కూడా లిప్‌స్టిక్‌తో. సరదాగా ఆడుకోవడానికి వచ్చి అక్కడ ఉన్న కారుపై గీతలు గీశాడు. అంతేకాదు.. అక్కడ్నుంచి నెమ్మదిగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాన్ని అక్కడి వాళ్లెవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.