Trai Recommends 2mbps As Minimum Broadband Speed
TRAI Recommandations: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక సూచనలు చేసింది. ఇంటర్నెట్ మినిమమ్ స్పీడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, సర్వీస్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేసింది. మినిమం బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ 2Mbps వరకు పెంచాలని ట్రాయ్ సూచించింది. ప్రస్తుతం ఉన్న 512Kbps స్పీడ్ బేసిక్ అప్లికేషన్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. ప్రస్తుత ఇంటర్నెట్ స్పీడ్ బేసిక్ అప్లికేషన్లు కూడా ఓపెన్ చేయడానికి సరిపోదని తెలిపింది. మినిమమ్ డౌన్‌లోడ్ స్పీడ్ 2Mbps ఉండేటా చేసుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల స్పీడ్ పెంచాలని సూచించింది.
Mumbai : కోవిడ్ పేరు చెప్పి…రూ. 1.3 కోట్లు కొట్టేసిన తల్లీ కూతుళ్లు
రూరల్ కనెక్షన్లకు నెలవారీ సబ్ సబ్ స్క్రిప్ట్షన్ ఫీజులో 50 శాతం రీయంబర్స్‌మెంట్ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. గతంలో 256Kbps స్పీడ్‌ను 2014లో 512 Kbpsకు అప్‌గ్రేడ్ చేయమని సూచించింది. ఇప్పుడు ఆ స్పీడ్‌ను నాలుగు రెట్లు పెంచాలని ట్రాయ్ సూచిస్తోంది. ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను యూకే, యూరప్ మాదిరిగా విభిన్న కేటగిరీలుగా విభజించాలని సూచనలు చేసింది. ఆ దేశాల్లో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్..2-50Mbps స్పీడ్, ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 50Mbps-300Mbps స్పీడ్, సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. 300Mbps కంటే ఎక్కువ స్పీడ్‌తో కేటగిరీలుగా విభజించారు.
దేశంలో కూడా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి పేర్కొంది. దేశవ్యాప్తంగా కేవలం 9.1 శాతం ఇళ్లకు మాత్రమే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను కేబులింగ్ సిస్టమ్ ద్వారా లైన్ సర్వీసులను పొడిగించింది. తక్కువ ఛార్జీల నెలవారీ ప్యాక్ రూ. 200 కంటే తక్కువగా ఉండాలని సూచించింది. E-Rupay ద్వారా ఆ డబ్బును కనెక్షన్‌దారుడికి జమ చేయాలని సూచించింది.
MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..