Train Accident : తమిళనాడులో రైలు ప్రమాదం : గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు.. దగ్ధమైన రెండు బోగీలు..!

తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఆగిన గూడ్స్‌‌రైలును ఏపీకి వెళ్తున్న మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు ‌‌‌ఢీకొట్టింది.

Train Accident _ Mysore-Darbhanga Express Collides With Goods Train in Tamil Nadu ( Image Source : Google )

Train Accident : తమిళనాడులో చెన్నై శివారులో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఆగిన గూడ్స్‌‌రైలును ఏపీకి వెళ్తున్న మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు ‌‌‌ఢీకొట్టింది. ఈ రైలు ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీలు మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలుపురు ప్రయాణికులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

కొన్ని రైలు కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. పట్టాలపై ఆగిన గూడ్స్ రైలును అతి వేగంతో దూసుకొచ్చిన మైసూరు-దర్భంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మంటల్లో దగ్ధమవుతున్న కోచ్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన రైలు మార్గంలో వచ్చే ఇతర రైళ్లను మరో మార్గంలో దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న 141 మంది విమాన ప్రయాణికులు..