Farm Laws Repeal bill : 750 మంది రైతులకు నివాళి..రాకేష్ టికాయత్

వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Parliament : వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021కు ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(BKU)ప్రతినిధి రాకేష్ టికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సాగు చట్టాల రద్దు బిల్లు.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మందికి నివాళి అని టికాయత్ తెలిపారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని చెప్పారు.

కాగా,పార్లమెంట్​ శీతాకాల సమావేశాల తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్​సభలో మధ్యాహ్నాం 12:6గంటలకు సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే కేవలం నాలుగు నిమిషాల్లోనే బిల్లు ఆమోదం పొందింది.

రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదం పొందింది. బిల్లుపై అన్ని పార్టీలు ఏకీభవించాయని, ఎవరూ వ్యతిరేకించడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.

ALSO READ ATM Theft : చెవులు వినపడవు, మాటలు రావు.. కానీ ఏటీఎంలో చోరీకి వెళ్ళాడు

ట్రెండింగ్ వార్తలు