10 ఉచిత ఎల్పీజీ సిలెండర్లు, 100 రోజుల ఉపాధి.. తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో

ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలును నిలిపివేస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీయిచ్చింది.

Trinamool Congress Manifesto: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తే పౌరసత్వ చట్టంలో మార్పులను రద్దు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హామీయిచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆ పార్టీ సీనియర్ నాయకులు కోల్‌క‌తాలో బుధవారం విడుదల చేశారు. విపక్షాల ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలును నిలిపివేస్తామని హామీయిచ్చింది. దీదీ వాగ్దానాలు పేరుతో టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేల హామీలను ఇందులో పొందుపరిచింది.

తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
1. నేరుగా ఇంటికే రేషన్ కార్డు, బీపీఎల్ ఫ్యామిలీస్‌కు సంవత్సరానికి 10 ఉచిత ఎల్పీజీ సిలెండర్లు
2. ఉపాధి హామీ జాబ్ కార్డ్ హోల్డర్లకు 100 రోజుల గ్యారెంటీ వర్క్, రోజుకు కనీస వేతనం రూ.400
3. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు కనీక మద్దతు ధర అమలు
4. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరల భారం పడకుండా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు
5. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లందరికీ (వయోపరిమితి 25 ఏళ్లు) నెలవారీ స్టైఫండ్‌తో ఏడాది అప్రెంటిస్‌షిప్‌

6. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణం పొందేందుకు క్రెడిట్ కార్డులు
7. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల ఉన్నత విద్యా ఉపకార వేతనాలు 3 రెట్లు పెంపు
8. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ. 1,000కు పెంపు
9. ప్రతి రేషన్‌కార్డుదారునికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్‌
10. ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన, గౌరవప్రదమైన ఇళ్లు

Also Read: 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. బెంగళూరు మహిళకు రూ.1.36 లక్షల జరిమానా..!

ట్రెండింగ్ వార్తలు