OC రిజర్వేషన్లకు TRS మద్దతు

ఓసీ రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు.

  • Publish Date - January 9, 2019 / 12:09 PM IST

ఓసీ రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు.

OC రిజర్వేషన్ల బిల్లుకి రాజ్యసభలో టీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP బండ ప్రకాశ్.. EBC రిజర్వేషన్లను సమర్దించారు. విద్య, ఉద్యోగాల్లో EBCలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానాలను కూడా బిల్లులో చేర్చాలని బండ ప్రకాశ్ డిమాండ్ చేశారు. ముస్లింలకు 12శాతం.. ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, కానీ అడ్రస్ లేదని బండ ప్రకాశ్ మండిపడ్డారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఎస్టీ జనాబా 10శాతానికి, ముస్లిం జనాబా 12శాతానికి చేరిందన్నారు. జనాబా దామాషా ప్రకారం రిజర్వేషన్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. రాష్ట్రం పంపిన తీర్మానాలను కూడా కేంద్రం ఈ సమయంలో పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటికే ఈబీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. వెనకబడిన వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని చాలాసార్లు కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

70ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా వెనకబాటు, ఆర్థిక అసమానతలు ఉన్నాయంటే గత ప్రభుత్వాల వైఫల్యమే కారణం అని బండ ప్రకాశ్ అన్నారు. ఇలాంటి బిల్లులు తెచ్చే ముందు తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు సామాజిక పరిస్థితుల ఆధారంగానే రిజర్వేషన్ల గురించి విన్నామని, మొదటిసారిగా ఆర్థిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చారని చెప్పారు.