Road Accident
Road Accident : మహారాష్ట్రలో తాజాగా దారుణ ప్రమాద ఘటన జరిగింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సోమవారం హైవేపై నిద్రపోతున్న కూలీలపై నుంచి ట్రక్కు వెళ్లడంతో ఐదుగురు కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వాడ్నర్ భోల్జీ గ్రామంలో నిర్మిస్తున్న సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న తాత్కాలిక గుడిసెల్లో కూలీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Aalso read : Nandikanti Sridhar : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్, కీలక నేత రాజీనామా
రోడ్డుపై వెళుతున్న లారీ నిద్రపోతున్న కూలీలపై నుంచి దూసుకెళ్లింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి వివరించారు.