ట్రంప్ ఫెయిల్ అయ్యాడు…మోడీ సేవ్ చేశాడు : బీజేపీ చీఫ్
- venkaiahnaidu
- Updated on- November 6, 2020 / 10:37 AM IST
Trump Couldn’t Handle Covid Properly, PM Modi Saved India కరోనా కట్టడికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గురువారం బీహార్ లోని దర్బంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా…అమెరికా ఎన్నికలపై కామెంట్ చేశారు. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి…డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు ఏమిటంటే ఆయన కోవిడ్-19ను సరిగ్గా నిర్వహించలేకపోయారు. కానీ మోడీజీ సకాలంలో నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని, 130 కోట్ల జనాభాను కాపాడారని నడ్డా అన్నారు. కరోనా విషయంలో ట్రంప్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దీనిని ప్రచారాస్త్రంగా చేసుకున్నారని నడ్డా తెలిపారు.
కాగా,కరోనా కట్టడి విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారంటూ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.
https://10tv.in/heavy-rains-bengaluru-men-save-babies/
కాగా, బీహార్‌లో శనివారం(అక్టోబర్-7,2020) మూడవ విడుత ఎన్నికల జరగనున్నాయి. ఫలితాలు 10వ తేదీన వెల్లడి కానున్నాయి.
