స్త్రీ, పురుషులు ఏదో ఒక కారణంతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రేయసి, ప్రియుడు ఇలా తేడానే లేదు. పచ్చటి దాంపత్య జీవితాన్ని కొంతమంది నాశనం చేసుకుంటున్నారు. ఈ బంధాల కారణంగా హత్యలు కూడా అధికమౌతున్నాయి. భార్య..భర్తలను చంపడం.., భర్తలు..భార్యలను చంపడం.., కూతురు, కొడుకులను చంపేస్తున్నారు. ఇలాంటి క్రైమ్స్ ఎన్నో దేశంలో జరుగుతున్నాయి. వీటిపై మద్రాసు హైకోర్టు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు
సమాజంలో వివాహేతర సంబంధాలు, దారుణాలకు బుల్లితెరపై వస్తున్న మెగా సీరియల్స్, సినిమాలు, కారణమౌతున్నాయా అంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి స్టడీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా..ఫ్యామిలీతో గడిపే సమయం తక్కువయిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది కోర్టు. ప్రాథమికంగా వివాహేతర సంబంధాలకు ఇవే కారణమౌతున్నాయా అనే డౌట్ వ్యక్తం చేసింది.
అంతేగాకుండా ఈ బంధాలు హత్యలకు కూడా కారణంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. దీని వెనక మద్యం కూడా ఓ పాత్ర పోషిస్తుందని తెలిపింది. భార్యాభర్తలిద్దరి ఆర్థిక స్వాతంత్రం, ఇంటర్నెట్, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం ఇలాంటి ఎన్నో కారణాలు వివాహేతర సంబంధాలకు కారణమౌతున్నాయా.. లేదా అనేది తెలుసుకోవాలని అనుకున్నట్లు వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసును 2019, జూన్ మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read : వివాహేతర సంబంధాలకు కారణం టీవీ సీరియల్స్, సినిమాలేనా?
అసలేం జరిగింది :
తిరువళ్లూరు జిల్లాలోని వేపంబట్టైకి చెందిన అజిత్‌కుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. గూండా చట్టం కింద జైల్లో పెట్టేందుకు పోలీసు కమిషనర్ ఉత్వర్వులు జారీ చేశారని, రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. రంజిత్ కుమార్, లోకేశ్ స్నేహితులు. ఓ యువతితో రంజిత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే యువతి లోకేశ్‌తో కూడా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. దీంతో రంజిత్, లోకేశ్ మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా రంజిత్‌ను మట్టుపెట్టాలని లోకేష్ పథకం రచించాడు. ఒక రోజు రంజిత్ కుమార్‌ను లోకేష్ హతమార్చాడు. ఈ కేసులో లోకేష్‌తో పాటు అజిత్ కుమార్ అరెస్టయ్యాడు. జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా హైకోర్టు పై విధమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read : వైఎస్సార్ సీపీకి అధ్యక్షుడు కేసీఆరే : సీఎం చంద్రబాబు