Tamil Nadu CM vijay Oath Ceremony : తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్

Tamil Nadu CM vijay Oath Ceremony : తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీ నటి త్రిష విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో సందడి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Tamil Nadu CM vijay Oath Ceremony

Tamil Nadu CM vijay Oath Ceremony : తమిళనాడు సీఎంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10గంటలకు చెన్నైలోని జవర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరితోపాటు.. సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటి త్రిష విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో సందడి చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. విజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

Also Read : Rain Alert : దూసుకొస్తున్న ద్రోణి.. ఏపీలో ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్నవానలు.. భీకర గాలులు, పిడుగులు.. హెచ్చరికలు జారీ.. 

మంత్రులుగా వీరే..
విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్‌ కీర్తన, కె.జి. అరుణ్‌ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్‌. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు.

తమిళనాడులో 1967 నుండి డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల నుంచే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 1967 తరువాత వేరే పార్టీల నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి సీఎంగా విజయ్ నిలిచారు. సాంప్రదాయ ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రచారం చేసుకుంటూ విజయ్ ద్రావిడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.