Warsaw University: వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడపై ఉపనిషత్తులు

యూరప్‌లోని పోలాండ్‌లో వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడపై ఉపనిషత్తులు చెక్కగా.. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసుకుంది.

Upanishads

Warsaw University: యూరప్‌లోని పోలాండ్‌లో వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడపై ఉపనిషత్తులు చెక్కగా.. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసుకుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వం ఐదు వేల సంవత్సరాల కంటే పాతది కాగా.. భారతీయ సంస్కృతి వైవిధ్యంతో స్ఫూర్తి పొంది, భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది రచయితలు దీనిని గురించి చక్కగా వివరించారు. పోలాండ్‌లో కనిపించిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పోలాండ్‌లోని వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడపై ఈ ఉపనిషత్ గ్రంథాలు చెక్కబడ్డాయి. ఈ చిత్రాన్ని పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం పంచుకుంటూ, ట్విట్టర్‌లో, “ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం! ఇది వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడ, ఉపనిషత్తులు చెక్కబడి ఉన్నాయి. హిందూ మతానికి పునాది వేసిన హిందూ తత్వశాస్త్రం చివరి వేద సంస్కృత గ్రంథాలు ఉపనిషత్తులు.” అంటూ రాసుకొచ్చారు.

పోలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం చేసిన ట్వీట్‌ను చాలామంది భారతీయులు షేర్ చేస్తున్నారు. గౌరవ్ అగర్వాల్ అనే వ్యక్తి, ఈ ట్వీట్‌ని షేర్ చేసి “మా విశ్వవిద్యాలయాలలో కూడా ఇలాంటివి అవసరం. హిందూమతం ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపించింది మరియు దాని వైదిక సంస్కృతి ఆధునిక విజ్ఞాన సృష్టికర్త” అని అన్నారు.