Girlfriend's Wedding
Girlfriend’s Wedding: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లి నిశ్చయమైంది. తనకిచ్చి చెయ్యాలి అని అడిగే దైర్యం కానీ పెళ్లిని ఆపే శక్తి కానీ లేదు. చేసేది ఏమి లేక బాధపడుతూ ఉండిపోయాడు.. ఇదే సమయంలో సొంతరాష్ట్రమైన బీహార్ లో లాక్ డౌన్ విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం ట్విట్టర్ ద్వారా లాక్ డౌన్ విషయం తెలిపాడు.
మే 16 నుంచి మే 25 వరకు లాక్ డౌన్ విధించనున్నట్లు ప్రకటించాడు. లాక్ డౌన్ వలన కరోనా మహమ్మారిని తగ్గించవచ్చని, సానుకూల ఫలితాలు వస్తాయని ఈ ట్విట్ లో పొందుపరిచాడు. అయితే ఈ ట్వీట్ కు ఓ యువకుడు రీట్వీట్ చేశాడు.
మీరు లాక్ డౌన్ అయితే పెట్టారు. కానీ పెళ్లిళ్లు చేసుకోవద్దని చెప్పలేదు. మే 19 న ప్రియురాలి పెళ్లి ఉంది.. పెళ్లిళ్లపై కూడా నిషేధం విడిస్తే తన ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది… తాను ఎప్పటికి మీకు కృతజ్ఞుడిగా ఉంటానని అతను తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.