Twins Fall To Death : 25వ ఫ్లోర్ నుంచి జారిపడి కవలలు మృతి
క్షణాల వ్యవధిలో కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే సమయంలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ సిటిలో ఈ సంఘటన జరిగింది.
- venkaiahnaidu
- Published On : October 17, 2021 / 03:35 PM IST
Up
Twins Fall To Death క్షణాల వ్యవధిలో కలిసి పుట్టిన అన్నదమ్ములు.. అంతే సమయంలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ సిటిలో ఈ సంఘటన జరిగింది.
అసలేం జరిగింది
ఘజియాబాద్ లోని సిద్దార్థ్ విహార్ లోని ప్రతీక్ గ్రాండ్ సొసైటీలో నివసించే 14 ఏళ్ల కవల సోదరులు సత్యనారాయన్,సూర్యనారాయన్.. ఆదివారం ఉదయం 1గంట సమయంలో తమ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లోని 25వ ఫ్లోర్ నుంచి జారి కిందపడి చనిపోయారు. చిన్నారుల మృతితో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఇద్దరు చిన్నారులు ఎలా కిందపడిపోయారనేది ఇంకా తెలియరాలేదు.
అయితే 25వ అంతస్తులోని బాల్కనీలో రాత్రి ఆడుకుంటూ కనిపించారని తల్లి తెలపగా..ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. చిన్నారులు ఇద్దరు తొమ్మిదివ తరగతి విద్యార్థులని తెలిపారు. చిన్నారుల తండ్రి ఆఫీసు పనిమీద ముంబైలో ఉన్నారని,అపార్లమెంట్ లో చిన్నారుల తల్లి,సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ సోనియా గాంధీ బయోపిక్.. వచ్చే ఎలక్షన్స్ కి ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ??
