Twitter Officials Appear Before Shashi Tharoor Led Parliamentary Panel
Twitter Representatives ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ ముందు శుక్రవారం ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం హాజరయ్యారు. డిజిటల్ వేదికలపై పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్ ప్రతినిధులను కమిటీ ప్రశ్నించనుంది. కాగా,కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఛైర్మన్‌గా ఉన్న ఈ స్టాండింగ్ కమిటీ.. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకుంటారో చెప్పాలంటూ ఇటీవల ట్విట్టర్‌కు సమన్లు జారీ చేసింన విషయం తెలిసిందే. జూన్ 18లోగా సాయంత్రం 4 గంటల్లోపు ఈ విషయంపై కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు కమిటీ ముందు హాజరై.. సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి చేపడుతున్న చర్యలపై కమిటీ సభ్యులతో చర్చించనున్నారు.
కాగా,జనవరిలో తొలిసారిగా ట్విట్టర్‌కు సమన్లు జారీ చేశారు. కొత్త ఐటీ నిబంధనలను నిరాకరించిన ట్విట్టర్.. కరోనా కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు సమయం కావాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో కొత్త నైతిక మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలపై ట్విట్టర్ అభ్యంతరం తెలపడంతో కేంద్రానిక, ట్విట్టర్‌కు మధ్య వార్ మరింత ముదిరింది.