Jammu and Kashmir : అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

Two Army officers, cop killed

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, పోలీసులు మరణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాణాలు కోల్పోయారు. (Jammu and Kashmir) అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. (gunfight) ఈ కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ తీవ్రంగా గాయపడి మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు.

Ramdev : రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై పోలీసు కేసు

ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం మేర కేంద్రభద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు లష్కరే ప్రాక్సీ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారని కూడా పోలీసువర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని నార్లా ప్రాంతంలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

సెప్టెంబరు 4వతేదీన జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు. లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు