550 కేజీల ఉల్లిగడ్డ చోరీ

  • Publish Date - October 24, 2020 / 08:48 AM IST

two arrested near Pune for stealing 550 kg onions : ఉల్లిగడ్డ కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. భారీగా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎక్కడైనా తక్కువ ధరకు ఉల్లిగడ్డలు ఇస్తున్నాంరటే క్యూలు కడుతున్నారు. కొంతమంది ఉల్లిగడ్డలను చోరీ చేస్తున్నారు.



ఒకటి కాదు..ఏకంగా 550 కిలోల ఉల్లిగడ్డలను చోరీ చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే సమీపంలో ఉన్న గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన వారు Sanjay Paradhi, Popat Kaleగా గుర్తించారు.



ఎప్పుడూ వచ్చే స్టాక్‌తో పోలిస్తే అక్టోబర్ 21న సగం స్టాక్ మాత్రమే వచ్చిందని, కొత్త పంట వచ్చే వరకు రేట్లు పెరుగుతూనే ఉండే అవకాశం ఉందన్నారు పుణే మార్కెట్ యార్డ్‌కు చెందిన కమిషన్ ఏజెంట్ విలాస్ భుజ్‌బాల్. ఖరీఫ్‌లో వేసిన 50 శాతం ఉల్లి పంటలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో దొంగలు దీనిని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.



భారీ వర్షాల కారణంగా..ఉల్లి పంట భారీగా దెబ్బతిన్నది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు నగరాల్లో కిలో ఉల్లి..రూ. 80 నుంచి 120 పలుకుతోంది. భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ గా…Lasalgaon agriculture produce market committee (APMC) పేరు గడించింది. 2020, అక్టోబర్ 21వ తేదీన పూణె మార్కెట్ యార్డు 40 నుంచి 50 ట్రక్కుల ఉల్లి మాత్రమే వస్తోందంటున్నారు. మొత్తానికి ఉల్లిగడ్డ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు