Two Coaches Of Empty Mumbai Local Train Derail ( Image Source : Google )
Mumbai Local Train : ముంబై లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లోకల్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పశ్చిమ రైల్వేలో ఆదివారం మధ్యాహ్నం కార్యకలాపాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పట్టాలు తప్పిన సమయంలో రైలు ఖాళీగా ఉన్నందున ఎలాంటి గాయాలు సంభవించలేదని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు.
పట్టాలు తప్పడం వల్ల దాదర్ వైపు స్లో ట్రాక్ మూసుకుపోయిందని, దాంతో సబర్బన్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన చెప్పారు. “చర్చిగేట్, ముంబై సెంట్రల్ మధ్య దాదర్ వైపు స్లో ట్రాక్ బ్లాక్ అయితే, నిరంతర కార్యకలాపాలను నిర్ధారించడానికి రైళ్లు ఈ రెండు స్టేషన్ల మధ్య ఫాస్ట్ లైన్‌కు మళ్లీస్తామని తెలిపారు. కోచ్‌లను రీరైల్ చేసి సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.