వివాహితపై కాలేజీలోనే గ్యాంగ్ రేప్, వీడియో తీసి కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

  • Publish Date - August 24, 2020 / 04:19 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా కంధ్లా పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ కాలేజీలో పని చేస్తున్న వివాహితపై అక్కడే పని చేసే ఇద్దరు ఉద్యోగులు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు దాన్ని వీడియో తీసి ఆమెను తరచూ బెదిరిస్తున్నారు. కోరిక తీర్చాలని వేధిస్తున్నారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఇద్దరు కామాంధులను అరెస్ట్ చేశారు.



రేప్ చేసి వీడియో తీసి వేధింపులు:
కంద్లా పట్టణానికి చెందిన వివాహిత ఇంటర్ కాలేజీలో పని చేస్తోంది. ఓ రోజు పని ఎక్కువగా ఉండటంతో రాత్రి వరకు ఆమె ఆఫీసులోనే ఉండిపోయింది. అదే సమయంలో ఆమెపై కన్నేసిన ఇద్దరు ఉద్యోగులు ఆమె బెదిరించి కాలేజీలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వీడియోను అడ్డం పెట్టుకుని ఆ ఇద్దరు కామాంధులు బాధితురాలని తరుచూ వేధిస్తున్నారు. తమ కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్నాళ్లు భయంతో వారి ఆగడాలు ఓర్చుకున్న బాధితురాలు, వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయింది.



కామాంధులను అరెస్ట్ చేసిన పోలీసులు:
ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించింది. తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే కాలేజీలోనే ఇలాంటి ఘోరం జరగడం, కాలేజీలోనే స్త్రీకి రక్షణ లేకపోవడం దారుణం అని స్థానికులు అంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.