Encounter : అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్…ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

Encounter

Encounter : జమ్మూకశ్మీరులో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కమాండర్ ఉజైర్ ఖాన్‌తో సహా ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు మరణించారని పోలీసులు గురువారం తెలిపారు. (Two LeT Terrorists Including Commander Trapped In Encounter) బుధవారం ప్రారంభమైన కోకెర్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, జమ్మూ కాశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ భట్ మరణించారు.

Jammu and Kashmir : అనంత్ నాగ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, డీఎస్పీ మృతి

కేంద్ర భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హుమాయున్ భట్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధన్‌కోక్‌లకు నివాళులర్పించారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందడం పట్ల జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం వ్యక్తం చేశారు. భారత ఆర్మీకి చెందిన సాయుధ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం అయ్యారు.

Ethiopia Flight : ఇథియోపియా విమానం కాక్‌పిట్‌లో పొగ…ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తోయిబా కమాండర్ అని పోలీసులు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ, పోలీసు అధికారులు హతమైన ఘటనపై భారత్‌లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాశ్మీర్‌లో ఉగ్రదాడిపై బలమైన సందేశాన్ని అందించడానికి బీసీసీఐ రాబోయే క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టును బహిష్కరించాలని భారత నెటిజన్లు డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు