జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో టెర్రరిస్టుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా టెర్రరిస్టుల దాడికి కుట్ర పన్నారు.
జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో టెర్రరిస్టుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా టెర్రరిస్టుల దాడికి కుట్ర పన్నారు. వారి కుట్రను పసిగట్టిన సైన్యం.. సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసింది. దక్షిణ కాశ్మీర్ లోని పడుచి ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు ఉన్నారనే సమచారంతో భద్రతా బలగాలు కార్డాన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారికి టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇమామ్ సాహిబ్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి
కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రామ్‌బన్ జిల్లాలో ఓ కారులో పేలుడు సంభవించడం కలకలం రేపింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌కు అతి సమీపంలో ఈ పేలుడు జరగడంతో భయాందోళనలకు గురయ్యారు. జవాన్లను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో బనిహల్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో శనివారం (మార్చి 30) ఉదయం ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పుల్వామాలో జైషే మహమ్మద్‌కు చెందిన టెర్రరిస్టు కారుతో దాడి చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న ఘటన నేపథ్యంలో ఆందోళనకు గురయ్యారు. శ్రీనగర్-జమ్మూ హైవేపై జరిగిన ఈ పేలుడుతో కారు తునాతునకలైంది. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీలచ్చుకున్నారు. సిలిండర్ పేలుడు వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Read Also : ఎన్నికల బరిలో నేరచరితులు : 213 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు