Two offer namaz at Mathura temple శ్రీకృష్ట జన్మస్థలమైన మథురలోని ఓ ఆలయంలో నమాజ్ చేసిన ఇద్దరు ముస్లిం యువకులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలోని నంద్ గాన్ ఏరియాలోని నంద్ బాబా ఆలయ ప్రాంగణంలో గత గురువారం ఫైజల్ ఖాన్, మొహమ్మద్ చాంద్ అనే ఇద్దరు యువకులు నమాజ్ చేశారు.
నకిలీ ఐడెంటిటీతో ఆలయంలోకి ప్రవేశించిన వీరిద్దరూ నమాజ్ చేయడం ప్రారంభించడంతో…వెంటనే విషయం తెలుసుకున్న ఆలయ పూజారి అలారం మోగించారు. ఈ వ్యవహారంపై ముకేష్ గోస్వామి,శివహరి గోస్వామి అనే ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు.
దీంతో ఇద్దరు ముస్లిం యువకులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆలయ సమీపంలో అదనపు ఫోర్స్ ని రంగంలోకి దింపినట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.