fire broke in Surat : సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం..భవనం పైనుంచి దూకేసిన కార్మికులు..ఇద్దరు మృతి

గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడటంతో కార్మికులు భవనంపైనుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

fire broke out in Surat : గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో సోమవారం (అక్టోబర్ 18.2021) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కడోదరలోని వారేలిలోని ఓ ప్యాకేజింగ్ యూనిట్‌లోని ఐదవ ఫ్లోర్ లో కార్మికులు డ్యూటీలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారి చుట్టుముట్టడంతో భయపడిపోయినన కార్మికులు ప్రాణాలు దక్కించుకోవానికి భవనంపై నుంచి దూకేశారు. ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అదే సయమంలో భవనంలో చిక్కుకుపోయిన 125 మంది సిబ్బంది సురక్షితంగా కాపాడారు. వీరిలో దాదాపు 100మందిని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో వందమందికిపైగా భవనంలో చిక్కుకున్నట్టుగా సమాచారం. వారిని కూడా కాపాడేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు