Encounter In Kashmir
Encounter In Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని దన్మార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
దీంతో స్థానిక పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు వెంటనే తేరుకొని ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరిని లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని చెప్పారు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.
సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. కాగా 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఏడుగురు ఉగ్రవాదులు చనిపోగా ఓ జవాన్ వీరమరణం పొందారు.