Uddhav Thackeray: ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం.. సుప్రింకోర్టులో ఉద్దవ్ వర్గానికి దక్కని ఊరట

సుప్రీంకోర్టు‌లో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయకుంటే.. ఆయనకు ఉపశమనం లభించేదని కోర్టు పేర్కొంది.

Uddhav Thackeray: సుప్రీంకోర్టు‌లో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కోలేనందున యధాతథ స్థితి కొనసాగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్ధవ్ రాజీనామా చేయకుంటే ఆయనకు ఉపశమనం లభించేదని విచారణ సందర్భంగా సీజేఐ అన్నారు. మహారాష్ట్రలో శివసేన (ఉద్దవ్ వర్గం), శివసేన (షిండే వర్గం) వివాదం పిటీషన్ల పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణ నిమిత్తం పెద్ద బెంచ్‌కి కోర్టు పంపింది.

Delhi Government: కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవడం సరైనది కాదని కోర్టు పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కోల్పోయారని శివసేన ఎమ్మెల్యేల వర్గం తీర్మానంపై గవర్నర్ ఆధారపడటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

 

గవర్నర్ యొక్క విచక్షణాధికారం చట్టం ప్రకారం లేదు. ఉద్దవ్ ఠాక్రే స్వచ్ఛందంగా సమర్పించిన రాజీనామాను కోర్టు రద్దు చేయదు. సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా థాకరేను గవర్నర్ పిలవడం సమర్థనీయం కాదని కోర్టు తెలిపింది. అలాగే గోగ్యాలేను స్పీకర్ విప్‌గా నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు