Dussehra rally: ఘర్షణగా మారిన శివసేన ‘దసరా ర్యాలీ’.. ఉద్ధవ్, షిండే వర్గాల కుమ్ములాట

దాదర్‭లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో షిండే వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‭లోని ఎంఎంఆర్‭డీఏ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తోంది.

Dussehra rally: ముంబైలో శివసేన ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ర్యాలీలో ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్ధవ్ థాకరే వర్గం, ఏక్‭నాథ్ షిండే వర్గాలకు చెందిన కొంత మంది ఈ ర్యాలీలో కుమ్ములాటకు దిగారు. వాస్తవానికి 56 ఏళ్లుగా శివసేన దసరా ర్యాలీ నిర్వహిస్తోంది. కాగా, ఈ ఏడాది మొదటిసారిగా రెండు వర్గాల ర్యాలీని శివసేన నిర్వహించింది.

నాసిక్-ఆగ్రా హైవేలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్ధవ్ మద్దతుదారులు కొంత మంది నాసిక్ నుంచి ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించే దసరా ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్నారు. అయితే తాము బస్సులో వెళ్తుండగా తమ బస్సును ఓవర్ టేక్ చేస్తూ షిండే వర్గానికి చెందినవారు తమను దూషిస్తూ వ్యాఖ్యానించారని, అనంతరం వారిని అడ్డగించి బుద్ధి చెప్పాల్సి వచ్చిందని ఉద్ధవ్ మద్దతుదారులు తెలిపారు. కాసేపు ఇరు వర్గాల వారు ఒకరినొకరు కుమ్ములాడుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్ధుమణిగింది.

దాదర్‭లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో షిండే వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‭లోని ఎంఎంఆర్‭డీఏ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తోంది.

Dussehra: ఎర్రకోటలో జరిగే దసరా వేడుకల్లో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేయనున్న ప్రభాస్

ట్రెండింగ్ వార్తలు