Udhayanidhi Stalin: ఈసారి జై శ్రీరాం నినాదంపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్.. బీజేపీ ఆగ్రహం

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని వారాల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు..

Udhayanidhi Stalin

Jai Shri Ram: పాకిస్థాన్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ ప్రేక్షకులు జై శ్రీరాం నినాదం చేయడం సరికాదంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని వారాల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జై శ్రీరాం నినాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ ఇవాళ ట్వీట్ చేస్తూ… ‘క్రీడాస్ఫూర్తికి, ఆతిథ్యానికి భారత్ పెట్టింది పేరు. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ ప్లేయర్ల పట్ల ప్రేక్షకులు దిగజారి ప్రవర్తించారు.. ఇది ఆమోదయోగ్యం కాదు. సోదరభావాన్ని పెంచే, దేశాలను ఏకం చేసే శక్తి క్రీడలది. దీన్ని ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించడం సరికాదు’ అని ట్వీట్ చేశారు.

ప్రపంచ కప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్‌ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔట్ కాగానే డ్రెసింగ్ రూంకు వెళ్తున్న సమయంలో ప్రేక్షకులు జై శ్రీరాం జై శ్రీరాం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అన్నమలై స్పందన

ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నమలై మండిపడ్డారు. ‘క్రీడలను ఓ ఆటగానే చూడాలంటూ ఉధయనిధి స్టాలిన్‌ సందేశాలు ఇస్తున్నారు. అసలు ఈ విషయంతో ఆ మంత్రి సంబంధమే లేదు. ఆయన సనాతన ధర్మాన్ని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు’అని నిలదీశారు.

Nara Rohit: ఏపీ సీఎం జగన్‌పై టాలీవుడ్ హీరో తీవ్ర విమర్శలు