14 రోజుల Home Quarantine..163 సార్లు బయటకెళ్లాడు..అందరిలో ఆందోళన

  • Publish Date - July 15, 2020 / 02:23 PM IST

భారత దేశంలో కరోనా ఎంతలా ఉగ్రరూపం దాలుస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. రోగికి తగిన సూచనలు ఇస్తూ…జాగ్రత్తలు తీసుకొమంటున్నారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుండడంతో క్వారంటైన్ లో ఉన్న వారు బయటకు అస్సలు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ కొంతమంది డోంట్ ఖేర్ అంటున్నారు.

యదేచ్చగా బయట తిరుగుతూ..ఇతరులకు వైరస్ వ్యాపింప చేస్తున్నారు. ఇలాగే..ఓ వ్యక్తిని 14 రోజుల హోం క్వారంటైన్ లో ఉండమని చెబితే…ఏకంగా 163 సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇదెలా అంటే…ఆ వ్యక్తి మొబైల్ సెల్ కు ఏర్పాటు చేసిన GPS tracker సాయంతో బయటపడింది. దీంతో అందరిలోనూ…ఆందోళన నెలకొంది.

కర్నాటక రాష్ట్రంలో సహబ్ సింగ్ అనే వ్యక్తి ముంబై కోటేశ్వర ప్రాంతం నుంచి 2020, జూన్ 29వ తేదీన ఉడిపికి వచ్చాడు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత నగరాలకు వచ్చిన వారికి ప్రభుత్వం 14 రోజుల హోం క్వారంటైన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. తనకు హోం క్వారంటైన్ విధించాలని కోరారు. దీంతో సహబ్ సింగ్ ను జులై 03 వరకు ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

కానీ సహబ్ సింగ్ నిబంధనలు పట్టించుకోలేదు. ఉడిపితో పాటు, కుందపూర్ పలు హోటళ్లను సందర్శించినట్లు అధికారులకు తెలిసింది. GPS tracker ద్వారా ఎక్కడికెక్కడికి వెళ్లాడో గుర్తించే పనిలో పడ్డారు. 14 రోజుల హోం క్వారంటైన్ కాలంలో సుమారు 163 సార్లు అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి పలు ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన అతనిపై కుందపూర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

మరోవైపు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా బెంగళూరులో లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020, జులై 14వ తేదీ మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. రాష్ట్రంలో 44 వేల 077 కేసులు నమోదు కాగా..17 వేల 390 మంది కోలుకున్నారు. 842 మంది చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు