Villagers Attack On Vaccine Team : వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన సిబ్బందిపై కర్రలతో గ్రామస్తులు దాడి

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో అవగాహన రాలేదనటానికి నిదర్శనంగా కొన్ని ఘటనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయానికి వచ్చిన వైద్య సిబ్బందిపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన సంచనలం కలిగించింది.

villagers attck on vaccine team  : కరోనా మహమ్మారిని అంతం చేయాలని ఎంతోమంది సైంటిస్టుల కృషి ఫలితంగా వ్యాక్సిన్ రానే వచ్చింది. కానీ వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలమైనా ఇంకా జనాల్లో అవగాహన రాలేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడట్లేదు. వ్యాక్సిన్ అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు. వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయటానికి వచ్చారని తెలిసి యూపీలోని బారాబంకీ గ్రామంలో ప్రజలు టీకా నుంచి తప్పించుకోవానికి ఏకంగా నదిలో దూకి ఈదుకుంటూ పారిపోయిన ఘటన సంచలనం కలిగింది. ఇది ఇంకా నయం..టీకా వద్దని పారిపోయారు. కానీ ఓ గ్రామంలో మాత్రం వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన వైద్య సిబ్బందిని గ్రామస్తులు ఏకంగా కర్రలు తీసుకుని దాడికి దిగారు. దీంతో సిబ్బంది భయపడిపారిపోయిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో ప్రజలు వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతున్నారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకుంటే కలిగే ఉపయోగాల గురించి గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు పంచాయతీ అధికారిణికి యత్నించారు. కానీ ఎవ్వరూ వినలేదు.ఇంతలో వ్యాక్సిన్ కిట్లు పట్టుకుని వైద్య సిబ్బంది మెయిల్ ఖేడీ గ్రామానికి చేరుకున్నారు. అది గమనించిన గ్రామస్తులు క‌ర్ర‌లు..రాళ్లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు. వారిపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు గ్రామంలోకి అడుగు పెడతారా?వేసేద్దాం అన్నట్లుగా కాచుకుని కూర్చున్నారు.

ఈ క్రమంలో వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌ారు. అంతే..అప్పటికే గానే రాళ్లు, కర్రలు పట్టుకుని రెడీగా ఉన్న గ్రామస్తులు ఒక్కసారిగా వైద్య సిబ్బందిపై దాడికి దిగారు. ఈ పరిణామం ఊహించని వైద్య సిబ్బంది హడలిపోయారు. తలో దిక్కూ పారిపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అలా కొంద‌రు అధికారులు వారు వచ్చిన కారులో తప్పించుకుని పారిపోగా..కొంతమంది దొరికేశారు. దీంతో గ్రామస్తులు వారిని చితకబాదారు. ఈ దాడిలో వైద్య సిబ్బందితో సహా పంచాయతీ అధికారిణికి కూడా తీవ్రగాయాల‌య్యాయి. అనంత‌రం ఆ గ్రామంలోకి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితులు అదుపులోకి తెచ్చారు. వైద్య సిబ్బందిపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు