×
Ad

Shivraj Singh Chouhan: ఆ విమానంలో కేంద్ర మంత్రికి ఊహించని అనుభవం.. కో పైలట్ ను చూసి షాక్..

విమానంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలను చౌహాన్ షేర్ చేశారు. అంతేకాదు..

Shivraj Singh Chouhan: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో ఊహించని ఘటన ఎదురైంది. ఆయన ప్రయాణించిన విమానంలో కో పైలట్ ను చూసి ఆయన ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత కో పైలట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అసలేం జరిగిందంటే..

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో విమానంలో కో పైలట్‌గా ఉన్న వ్యక్తిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ కో పైలట్ మరెవరో కాదు. బీజేపీకి చెందిన సీనియర్ నేత, బిహార్ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ. అవును, బీజేపీ ఎంపీ రూడీ కో పైలట్ గా మారారు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ లో షేర్ చేశారు కేంద్ర మంత్రి చౌహాన్. పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం తనకు మరవలేనిది అని అన్నారు. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఛప్రా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కో పైలట్‌గా ఉన్నారని రాసుకొచ్చారు. మీరు మా హృదయాలను గెలుచుకున్నారు అంటూ ఎంపీ రూడీపై ప్రశంసల వర్షం కురిపించారాయన.

విమానంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలను చౌహాన్ షేర్ చేశారు. అంతేకాదు రూడీని ప్రశంసిస్తూ రాసిన లేఖను కూడా ఎక్స్ లో పెట్టారాయన. రూడీపై కేంద్ర మంత్రి చౌహాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు అని కితాబిచ్చారు. బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ.. తమలో ఉన్న ప్రతిభ కోసం సమయం కేటాయిస్తారని మెచ్చుకున్నారు. రాజీవ్ ప్రతాప్ రూడీ.. బిహార్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.

దీనికి సంబంధించి చౌహాన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘రాజీవ్‌ ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. పట్నా నుంచి దిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం నాకు మరవలేనిది. ఎందుకంటే ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ కో పైలట్‌గా ఉన్నారు’ అని రాసుకొచ్చారు.

Also Read: డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..