#UnionBudget 2023 : ధరలు తగ్గేవి, పెరిగేవి ఏవంటే..

ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం..

#UnionBudget 2023 : ఎన్నో ఆశలతో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. ఇక ఏవేవి పెరుగుతాయో..వేటి ధరలు తగ్గుతాయో అని ఎదురు చూసినవారికి స్పష్టత ఇచ్చేశారు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి సీతమ్మ బంగారంతో పాటు వజ్రాలు, వెండి ధరలు పెరుగతాయని ప్రకటించారు. వీటితో పాటు బ్రాండెండ్ దుస్తుల ధరలు కూడా పెరుగతాయని ప్రకటించారు. మొత్తమ్మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. అటు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు. రూపాయి రూపాయి జమ చేసుకుని బంగారం కొందామనే ఆశతో ఉండే సామాన్యులకు సీతమ్మ చేదు వార్త చెప్పారనే అనుకోవాలని. ఎందుకంటే బంగారంతో పాటు వెండి ఆభరణాలు ధరలు పెరుగుతాయని ప్రకటించారు బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతమ్మ. ఇక వీటితో పాటు ధరలు పెరిగేవి ఏమిటో..తగ్గేవి ఏమిటో తెలుసుకుందాం. పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం..మరి ధరలు పెరిగేవి ఏమిటి? తగ్గేవి ఏమిటో చూద్దాం..

ధరలు పెరిగేవి…
వాహనాల టైర్లు
సిగరెట్లు
బంగారం, వెండి
వజ్రాలు
బ్రాండెడ్ దుస్తులు
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు

ధరలు తగ్గేవి…
ఎలక్ట్రిక్ వాహనాలు
టీవీలు, మొబైల్ ఫోన్లు
కిచెన్ చిమ్నీలు
లిథియం అయాన్ బ్యాటరీలు
కెమెరాలు
లెన్సులు

 

 

 

ట్రెండింగ్ వార్తలు