సమస్య వచ్చినప్పుడల్లా… జైట్లీ అండగా నిలబడ్డారన్న అమిత్ షా

తన జీవితంలో సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా అరుణ్ జైట్లీ తనకు అండగా నిలబడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన మనతో లేడన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగత నష్టం అని షా అన్నారు. దేశానికి ఆయన గొప్ప సేవ చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ కుటుంబసభ్యులకు,బీజేపీ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

జైట్లీ మరణం బీజేపీ కార్యకర్తలకు పూడ్చలేని లోటన్నారు. ఓ విద్యార్థి నాయకుడిగా,ఎమర్జెన్సీ సమయంలో 19నెలలు జైల్లో గడిపిన వ్యక్తిగా,ఓ పార్లమెంటేరియన్ గా ప్రజల తరపున గళం వినిపించేవాడని,అవినీతి పట్ల కఠినంగా ఉండేవాడని అమిత్ షా అన్నారు.