అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి : భుజాల‌పై మోసిన రాజ్ నాథ్

పుల్వామా ద్వాడిలో  అమ‌రులైన జ‌వాన్ల మృతదేహాల‌ను బుడ్గామ్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ కి త‌ర‌లించారు. అమ‌ర‌ జ‌వాన్లకు కేంద్ర‌హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, జ‌మ్మూకాశ్మీర్ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్, ఆర్మీ ఉత్త‌రాది క‌మాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ర‌ణ్ బీర్ సింగ్ లు ఘ‌న నివాళుల‌ర్పించారు. వీర్ జ‌వాన్ అమ‌ర్ రహే నినాదాల‌తో అమ‌రుల‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు నివాళుల‌ర్పించారు. ఇత‌ర సైనికుల‌తో క‌లిసి  అమ‌రుడైన ఓ సీఆర్పీఎఫ్ జవాను  మృతదేహాన్ని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీజీపీ దిల్బాగ్ సింగ్ లు  త‌మ భుజాల‌పై మోశారు.

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే