×
Ad

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

కొవిడ్ నిబందనలు ఎత్తివేసే విషయంలో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published On : March 23, 2022 / 03:17 PM IST

India Covid 19

India should lift the Covid-19 rules : రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని హడలెత్తించిన కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో అందరు హాయిగా ఊపిరి తీసుకుంటున్నారు.కానీ నిబంధనల్ని పాటిస్తే కోవిడ్ ను పూర్తిగా అంతం చేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈక్రమంలో భారత్ లో కోవిడ్ కేసులు భారీగా తగ్గు ముఖం పట్టాయి. కేసుల నమోదు భారీగా తగ్గిపోయాయి.

దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31నుంచి దేశంలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో మార్చి 31నుంచి కోవిడ్ నిబంధనలు ముగియనున్నాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వైరస్ నియంత్రణకు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద మార్గదర్శకాలు
జారీ చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలు ఎత్తివేసినా.. ప్రజలంతా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాజా ఉత్తర్వులు
జారీ చేసింది కేంద్రం.

వైరస్ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రాలలో కేసులు పెరుగెతే స్థానికి ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చు అని కేంద్ర హౌం శాఖ సూచించింది. ఫేస్ మాస్క్‌ల వాడకంతో సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై సలహాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.