PM Modi Birthday
PM Modi Birthday – Celebrities Wish : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..మోదీకి జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తన దూరదృష్టి, అవిశ్రాంతమైన కృషి , నిస్వార్థ సేవ ద్వారా కోట్లాది ప్రజల జీవితాల్లో శ్రేయస్సు విశ్వాసాన్ని తీసుకువచ్చిన దేశ ప్రఖ్యాత ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
PM Modi birthday : మోదీ జన్మదినోత్సవ వేళ ఆటోవాలాల బంపర్ డిస్కోంట్ ఆఫర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరి తరపున మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని మోదికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆదర్శవంతమైన నాయకత్వంలో భారత్ అన్ని విధాలుగా అపూర్వమైన ఎత్తుకు ఎదిగిందన్నారు. మోదీ దీర్ఘాయువుతో ఉండాలని కోరుకున్నారు. దేశ యువతను ఉత్తేజపరిచే భక్తితో భారత్ మాతకు సేవ చేస్తూ ఉండాలన్నారు.