Bhabhi ji papad : ఈ అప్పడాలు తింటే కరోనా రాదంట

  • Publish Date - July 24, 2020 / 02:23 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసికి విరుగుడు ఇదే అంటూ..సోషల్ మీడియాలో తెగ వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గో మూత్రం తాగితే రాదు..ఆవు పేడ శరీరానికి రాసుకుంటే వైరస్ దరిచేరదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి.

కొంతమంది వీటిని కొట్టివేస్తుండగా, మరికొంతమంది ఫాలో అవుతున్నారు. తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్ తో పోరాడుతాయని అంటున్నారు. ఆయన ఎవరో కాదు..సహాయ మంత్రి కావడం ఇక్కడ గమనార్హం.

ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద వీటిని తయారు చేసినట్లు భారీ పరిశ్రమల సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడించారు. ఆ సంస్థకు శుభాకాంక్షలు చెబుతూ..వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో ఇది వైరల్ అయ్యింది.

భారతదేశంలో కరోన విపరీతంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. కుదేలైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

దీని పేరిట అప్పడాలను తయారు చేసిన బాబ్జీ పాపడ్ (అప్పడాలు) మార్కెట్ లోకి విడుదల చేశారు సహాయ మంత్రి. ఈ సందర్భంగా వీటిని తింటే..యాంటీబాడీస్ పెరుగుతాయని చెప్పారు. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

కరోనాపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దేశానికి కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదా ? అంటూ సెటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.