Kiren Rijiju : ఇంధన ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కీలక కామెంట్స్.. అందుకే ధరలు పెరిగాయంట..
kiren rijiju : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Harish Thanniru
- Updated on- May 15, 2026 / 02:41 PM IST
minister kiren rijiju
Kiren Rijiju : దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఎక్స్ వేదికగా స్పందించారు. పశ్చిమాసియా పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయని, అయినా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయని అన్నారు. అన్నిదేశాల కంటే భారతదేశంలోనే పెట్రోల్ రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.
మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20 నుంచి 100శాతం పెంచాయి. కానీ, భారత దేశంలో మాత్రం పెట్రోల్ పై 3.2శాతం, డీజిల్ పై 3.4 శాతం పెరిగింది. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన, ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం, ఈ నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది అంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
As the world battled rising fuel costs after the West Asia conflict, India stood apart.
While several countries witnessed petrol & diesel hikes ranging from 20% to nearly 100%, India limited the increase to just +3.2% for petrol & +3.4% for diesel.
Even as Brent crude crossed… pic.twitter.com/nbyiBbhhC9
— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2026
2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే, లోక్ సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2చొప్పున తగ్గించాయి. తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం, హర్మూజ్ జలసంధి దిగ్భందనం కారణంగా నౌకా రవాణా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.
