BCCL Compassionate Job : దారుణం.. ఉద్యోగం కోసం కన్నతండ్రినే హత్య చేయించిన కొడుకు.. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటంటే?
BCCL Compassionate Job : ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి తన సొంత తండ్రిని హత్య చేయించాడు.
Unemployed Son Kills Father To Secure Government Job In Dhanbad district Jharkhand
- ప్రభుత్వ ఉద్యోగం కోసం కొడుకు దారుణం
- సుఫారీ ఇచ్చి తండ్రిని హత్యచేయించిన వైనం
- జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో ఘటన
BCCL Compassionate Job : ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి తన సొంత తండ్రిని హత్య చేయించాడు. హత్యకోసం ఇద్దరు వ్యక్తులకు రూ.10లక్షల సుఫారీ ఇచ్చాడు. సాంకేతిక ఆధారాలు, విచారణలో సేకరించిన సమాచారంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొట్టిన తుఫాను వాహనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తులేశ్వర్ నోనియా (58) భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) లో స్టోర్‌కీపర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పదవీ విరమణ సమయం దగ్గరపడుతుండటంతో, ఉద్యోగం తనకు రాదనే ఉద్దేశంతో రెండో కుమారుడు విజయ్ నోనియా దారుణ కుట్ర పన్నాడు. తన తండ్రిని హత్య చేయించడం ద్వారా కారుణ్య నియామకం కింద తాను ఆ ఉద్యోగాన్ని పొందొచ్చునని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడవుగా తన తండ్రిని హత్య చేయించేందుకు అఖిలేశ్ మల్లాహ్, అమిత్ కుమార్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులకు రూ.10లక్షలు సుఫారీ ఇచ్చాడు.
తులేశ్వర్ నోనియా విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో నిందితులు (అఖిలేశ్, అమిత్ కుమార్) రాయితో తలపై బలంగా దాడి చేసి హత్య చేశారు. జూన్ 20న చితాహి-బరోరా రమదారి పక్కన పొదల్లో మృతదేహం కనిపించిందని ఓ వాచ్మెన్ సమాచారం ఇవ్వండి పోలీసులు ఘటన స్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టగా.. తులేశ్వర్ నోనియా మృతదేహంగా గుర్తించి వారి కుటుంబ సభ్యలుకు సమాచారం ఇచ్చారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా ప్రబుత్వం ప్రత్యే దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది.
సిట్ బృందం సాంకేతిక ఆధారాలు, విచారణలో సేకరించిన సమాచారంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా.. విజయ్ నోనియానే తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అని, ఉద్యోగం కోసం ఈ కుట్ర పన్నినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులు సమాచారంతో హత్యకు ఉపయోగించిన రాయి, మోటార్ సైకిల్, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
