Deepa Thomas : మహేష్ బాబు పొగిడిన ‘దీపా థామస్’ ఎవరు? తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటి..
మలయాళ నటి దీపా థామస్.. సత్యదేవ్ రావు బహదూర్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.(Deepa Thomas)

మహేష్ బాబు పొగిడిన 'దీపా థామస్' ఎవరు? తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటి..

మలయాళ నటి దీపా థామస్.. సత్యదేవ్ రావు బహదూర్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామి అయ్యారు.

తాజాగా రావు బహదూర్ సినిమా చూసిన మహేష్ సినిమా గురించి గొప్పగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ క్రమంలో ఇందులో హీరోయిన్ గా నటించిన దీపా థామస్ కూడా అందంగా అద్భుతంగా నటించిందని తన పర్ఫార్మెన్స్ ని పొగిడాడు మహేష్.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో రావు బహదూర్ సినిమాపై ఆసక్తి నెలకొంది. సరికొత్తగా అయితే ఉండబోతుందని తెలుస్తుంది.

దీపా థామస్ మలయాళ నటి. కేరళకు చెందిన ఈ భామ మలయాళంలో ఇప్పటికే హోమ్, మోహన్ కుమార్ ఫ్యాన్స్, పెరుమాని, వైరస్.. ఇలా పలు సినిమాల్లో హీరోయిన్ గా, కీలక పాత్రల్లోనూ నటించింది.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ ఇప్పుడు రావు బహదూర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత దీపా థామస్ కి తెలుగులో మరిన్ని అవకాహలు రావడం ఖాయం అంటున్నారు.






























Deepa Thomas
