×
Ad

UP Elactions : ఓట్ల కోసం ఫీట్లు..మోడీ, యోగీ బొమ్మలతో చీరలు

యూపీ ఎన్నికల ప్రచారాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఓట్ల కోసం వెరైటీ దశ్యాలు కనిపిస్తున్నాయి.సూరత్ లో చీర‌ల‌పై మోడీ, యోగీ బొమ్మల్ని ముద్రించారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published On : January 19, 2022 / 02:11 PM IST

Up Elactions..sarees On Modi And Yogi Photos

UP Elactions..Sarees on modi and yogi Photos : ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అటు అధికారి పార్టీ..ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.పలు హామీలు ఇస్తున్నాయి. వినూత్న పద్ధతిలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాత్ బొమ్మలతో చీరలు హల్ చల్ చేస్తున్నాయి.

ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు ఓట్ల కోసం వెరైటీ వెరైటీ ఫీట్లు చేయ‌డం మామూలే. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాస్త వెరైటీ దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకోవటానికి బీజేపీ తనదైన స్టైల్లో వినూత్న యత్నాలు చేస్తోంది. వెరైటీ చీర‌ల‌ను డిజైన్ చేయించింది. ఆ చీర‌ల‌పై ప్ర‌ధాని మోదీ, సీఎం యోగిల ఫోటోలు ముద్రించారు.

Also read : Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన

గుజ‌రాత్‌లోని సూర‌త్‌ వస్త్రాలకు, వజ్రాలకు ప్రసిద్ధి అనే విషయం తెలిసిందే. అటువంటి సూరత్ లో చీర‌ల‌పై మోడీ, యోగీ బొమ్మల్ని ముద్రించారు. చీర‌ల‌పై మోదీ, యోగి ఫోటోలు ఉన్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ చీర‌ల‌పై బీజేపీ పార్టీ కమల పువ్వు గుర్తు కూడా ఉంది.

అయోధ్య థీమ్‌తో త‌యారైన ఆ చీర‌ల‌ను ఈస్ట్ర‌న్, వెస్ట్ర‌న్ యూపీలో ఉండే మ‌హిళా ఓట‌ర్ల‌కు పంచిపెట్ట‌నున్నారు. యూపీలో ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఏడు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. మోదీ, యోగి ఫోటోలు ఉన్న చీరల వీడియోను అహ్మాదాబాద్ జ‌ర్న‌లిస్టు షేర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సుమారు వెయ్యి చీర‌ల‌ను ఓట‌ర్ల‌కు పంచ‌నున్నారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. మోదీ బొమ్మ ఉన్న చీర‌ల‌ను త‌యారు చేశారు. వాటిని 1500కు ఒక‌టి చొప్పున అమ్మారు. జార్ఖండ్‌లో ఆ చీర‌ల‌కు ఫుల్ డిమాండ్ వ‌చ్చింది.

Also Read : Spacewalk 2022: 2022లో మొట్టమొదటిసారిగా నేడు “స్పేస్ వాక్”