Spacewalk 2022: 2022లో మొట్టమొదటిసారిగా నేడు “స్పేస్ వాక్”

భూమికి సుదూరంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఇద్దరు వ్యోమగాములు బుధవారం స్పేస్ వాక్(అంతరిక్ష నడక) చేయనున్నారు.

Spacewalk 2022: 2022లో మొట్టమొదటిసారిగా నేడు “స్పేస్ వాక్”

Spca

Spacewalk 2022: 2022లో మొట్టమొదటిసారిగా ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. భూమికి సుదూరంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఇద్దరు వ్యోమగాములు బుధవారం స్పేస్ వాక్(అంతరిక్ష నడక) చేయనున్నారు. 2022 ఆరంభంలో జరుగుతున్న మొట్టమొదటి స్పేస్ వాక్ ఇదే కావడంతో ఈ దృశ్యాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ప్రస్తుతం ISSలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రష్యా వ్యోమగాములు..అంటోన్ ష్కప్లెరోవ్ మరియు ప్యోటర్ డుబ్రోవ్ లు బుధవారం ఈ నడక (యాత్ర) చేపట్టనున్నారు.

Also read: International Flights: అంతర్జాతీయ విమానాలు రద్దు.. ఫిబ్రవరి 28వరకూ ఇంతే

Expedition-66లో భాగమైన వీరిద్దరూ రష్యాకు చెందిన “ప్రిచాల్(Prichal) మోడ్యూల్”లో.. హ్యాండ్‌రైల్‌లు, ఇతర దేశాలకు చెందిన యాంటెనాలు, టెలివిజన్ కెమెరా మరియు డాకింగ్ టార్గెట్స్ పై మరమ్మతులు చేపట్టనున్నారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి సుమారు ఏడూ గంటల పాటు వీరు ఈ పనులు చక్కబెట్టనున్నారు. దీని ద్వారా భవిష్యత్ లో రష్యా నుంచి వచ్చే అంతరిక్ష నౌకలకు మార్గం సుగమం చేయనున్నారు. నవంబర్ 2021లో రష్యా అభివృద్ధి చేసిన నౌకా(Nauka) లేబొరేటరీకి అనుబంధంగా ప్రస్తుత మాడ్యూల్ పనిచేస్తుంది. అంటోన్ ష్కప్లెరోవ్ మరియు ప్యోటర్ డుబ్రోవ్ ఇరువురికి స్పేస్ వాక్ చేయడంలో నిష్ణాతులు.

Also read: Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు

వీరిలో అంటోన్ Expedition-66 సిబ్బందికి కమాండర్ గా వ్యవహరిస్తుండగా, ప్యోటర్ ఫ్లైట్ ఇంజనీర్ గా చేస్తున్నారు. అంటోన్ ష్కప్లెరోవ్ కు ఇది మూడో స్పేస్ వాక్ కాగా, ప్యోటర్ డుబ్రోవ్ కు నాలుగోది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈఏడాది మరిన్ని స్పేస్ వాక్ లు నిర్వహించనున్నట్లు నాసా తెలిపింది. నౌకా లేబొరేటరీకి అనుబంధంగా యూరోప్ కు చెందిన రోబోటిక్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ స్పేస్ వాక్ జరుగుతుండగా.. ఇప్పటివరకు ISSలో జరిగిన వాటిలో ఇది 246వ స్పేస్ వాక్.

Also read: AP Govt. Employees: భజనతో కాదు బాధ్యతతో మెలుగుతాం: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం