Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు

రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, టెస్ట్ కేంద్రాలలో రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వివరించారు

Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు

Covid

Minister Harish Rao: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు వేగవంతం చేయాలనీ కేంద్ర వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు కోనసాగించాలని ఆదేశించింది. తెలంగాణలోనూ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీష్ రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈక్రమంలో బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.

Also read: AP Govt. Employees: భజనతో కాదు బాధ్యతతో మెలుగుతాం: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, టెస్ట్ కేంద్రాలలో రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలి, ఆసుపత్రిలో కరోన చికిత్సలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కరోనా సోకి ఇంటి వద్ద చికిత్స తీసుకునే వారికి ఉచిత హోం ఐసోలేషన్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Also Read: Tesla Car: ట్రాఫిక్ లో ఉన్నపుడు టెస్లా కారులో పోర్న్ చూస్తున్న “ఘనుడు”

కరోనా బాధితుల ఐసోలేషన్ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ సౌకర్యంతో వంద పడకల ఆసుపత్రి సిద్ధంగా ఉందని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంసిద్దంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు.

Also Read: Actress Murder: గన్నీ బ్యాగ్ లో బంగ్లాదేశ్ నటి మృతదేహం